సిక్కిం సీఎంగా ప్రేమ్‌సింగ్‌ ప్రమాణస్వీకారం | Prem Singh Tamang takes oath As New Sikkim Chief Minister | Sakshi
Sakshi News home page

సిక్కిం సీఎంగా ప్రేమ్‌సింగ్‌ ప్రమాణస్వీకారం

May 27 2019 4:08 PM | Updated on May 27 2019 4:12 PM

Prem Singh Tamang takes oath As New Sikkim Chief Minister - Sakshi

సిక్కిం క్రాంతికారి మోర్ఛా(ఎస్‌కేఎమ్‌) అధ్యక్షుడు ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ సోమవారం సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

గ్యాంగ్‌టక్‌ ‌: సిక్కిం క్రాంతికారి మోర్ఛా(ఎస్‌కేఎమ్‌) అధ్యక్షుడు ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ సోమవారం సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌తో గవర్నర్‌ గంగా ప్రసాద్‌ ప్రమాణ స్వీకారం చేపించారు. పల్జోర్‌ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి సిక్కిం క్రాంతికారి మోర్ఛా మద్దతు దారులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.  ప్రేమ్‌ సింగ్‌ నేపాలి భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. 

సిక్కిం అసెంబ్లీలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఎస్‌కేఎమ్, ఎస్డీఎఫ్‌ పార్టీల మధ్య హోరాహోరి పోరు జరిగింది. ఎస్‌కేఎమ్ 17 స్థానాల్లో గెలుపొందగా, ఎస్టీఎఫ్ 15 స్థానాలతో తృటిలో అధికారాన్ని కోల్పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement