
కిడ్నాప్ తప్పించుకోవడానికి... ఆటోలోంచి దూకిన యువతి
ఆటో డ్రైవర్ అపహరించడానికి ప్రయత్నించగా కదులుతున్న ఆటోలోంచి బయటకు దూకిన స్వప్నాలీ లాడ్ (24) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తీవ్రంగా గాయాలపాలైంది.
తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలు..
థానే: ఆటో డ్రైవర్ అపహరించడానికి ప్రయత్నించగా కదులుతున్న ఆటోలోంచి బయటకు దూకిన స్వప్నాలీ లాడ్ (24) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తీవ్రంగా గాయాలపాలైంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన శుక్రవారం జరిగింది. ఆ రోజు విధులు ముగించుకున్న స్వప్నాలీ కుపుర్‌బావ్డీ నుంచి కొల్షేట్‌లో ఉన్న తన ఇంటికి రాత్రి 9:15 గంటల ప్రాంతంలో బయలుదేరింది. డ్రైవర్ కొల్షేట్‌వైపు కాకుండా భివండీ ప్రాంతం వైపు ఆటోను తిప్పడంతో ఆ యువతి భయపడి బయటకు దూకేసింది.
దీంతో ఆమె తలకు, పొట్టభాగంలో తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆ యువతి తండ్రి నితిన్ లాడ్ ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు ఐపీసీ 364, 511 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం స్వప్నాలీ పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఆమె తండ్రి తెలిపారు. ఇప్పటి వరకూ కూడా ఆమె స్పృహలోకి రాలేదన్నారు.