గోవా గవర్నర్ రాజీనామా | Goa Governor B V Wanchoo resigns | Sakshi
Sakshi News home page

గోవా గవర్నర్ రాజీనామా

Jul 4 2014 8:15 PM | Updated on Sep 2 2017 9:48 AM

గోవా గవర్నర్ బీవీ మాంచూ శుక్రవారం వైదొలిగారు.

పనాజీ: యూపీఏ హయాంలో నియమితులైన మరో గవర్నర్ రాజీనామా చేశారు. గోవా గవర్నర్ బీవీ మాంచూ శుక్రవారం వైదొలిగారు. యూపీఏ ప్రభుత్వం నియమించిన గవర్నర్లు వైదొలగాలని ఎన్డీయే ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. పశ్చిమబెంగాల్ గవర్నర్ నారాయణన్ కూడా ఇటీవల రాజీనామా చేశారు.

ఇదిలావుండగా, శుక్రవారం ఉదయం అగస్టా వెస్ట్లాండ్ ఒప్పందం కేసులో బీవీ వాంచూను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. పనాజీలో రాజ్భవన్కు వెళ్లి మూడున్నర గంటల పాటు వాంచూను విచారించారు. ఇదే కేసులో ఎంకే నారాయణన్ను కూడీ సీబీఐ విచారించింది. అగస్టా ఒప్పందం సమయంలో నారాయణన్ జాతీయ భద్రత సలహాదారుగా ఉండగా, వాంచూ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చీఫ్గా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement