బిహార్‌లో రెచ్చిపోయిన మృగాళ్లు | Four detained after a video of eight men trying to sexually molest minor girl went viral | Sakshi
Sakshi News home page

బిహార్‌లో రెచ్చిపోయిన మృగాళ్లు

May 1 2018 2:20 AM | Updated on Sep 26 2018 6:15 PM

Four detained after a video of eight men trying to sexually molest minor girl went viral - Sakshi

జెహానాబాద్‌: బిహార్‌లోని జెహానాబాద్‌లో మృగాళ్లు రెచ్చిపోయారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ బాలికపై ఎనిమిది మంది నీచులు వేధింపులకు పాల్పడ్డారు. తనను ఏమీ చేయవద్దని వేడుకున్నా, కనికరం లేకుండా వారు బాలిక దుస్తులను చించివేశారు. అనంతరం ఆమె కాలును పట్టుకుని ఈడ్చుకెళ్లారు.

ఇంత జరుగుతున్నా ఏ ఒక్కరూ వారి ఆగడాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు, సరికదా దానిని మొబైల్‌లో వీడియోలు తీశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారటంతో పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు. మొత్తం నిందితుల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని, వీరిలో ఒకరు మైనర్‌ అని పట్నా ఐజీ ఖాన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement