ఆ ట్రాలీ ఆటోని దెయ్యం నడిపిందా? | Driverless Trally Auto Run on Road in Gujarat | Sakshi
Sakshi News home page

Dec 9 2017 11:00 AM | Updated on Dec 9 2017 11:13 AM

Driverless Trally Auto Run on Road in Gujarat - Sakshi

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లో ఓ ట్రాలీ ఆటో రోడ్డుపై హల్‌ చల్‌ చేసిన వీడియో వైరల్‌ అవుతోంది. డ్రైవర్‌ లేకుండానే దానికదే ప్రయాణింటంతో అంతా అవాక్కవుతున్నారు. భరూచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.  

సరుకులతో ఉన్న ఆ ట్రాలీ రహదారిపైకి ఎక్కేసి ముందుకు సాగింది. ఈ క్రమంలో మోటర్‌ బైక్‌ మీద వెళ్తున్న వెంటనే వీడియో తీయటం ప్రారంభించారు. డివైడర్‌ను ఢీకొట్టిన తర్వాత కూడా అది ముందుకు సాగింది. కొద్ది దూరం వెళ్లాక ఓ లారీని తగిలినప్పటికీ.. అది ఆగలేదు. అక్కడ బైక్‌ పై ఉన్న ఓ వ్యక్తి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మరికొంత దూరం వెళ్లాక ఓ ట్రక్కును ఢీకొట్టి అప్పుడు అది ఆగిపోయింది. ఈ ఘటనలో దాని అద్దం పగిలిపోయింది. 

ఇక ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బహుశా దెయ్యం ఆ ఆటో నడిపి ఉంటుందని కొందరు కామెంట్లు చేస్తే... ఇండియాలోనే ఇలాంటి ఘటనలు జరుగుతాయని మరికొందరు... ఇంకొందరైతే గూగుల్‌, యాపిల్‌, జీఎం లాంటి వాళ్లు చేస్తున్న డ్రైవర్‌ లెస్‌ వాహనాల ప్రయోగాల కంటే మనమే ముందున్నామంటూ సెటైర్లు వేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement