సైబర్ నేరగాళ్లతో జరజాగ్రత్త! | Sakshi
Sakshi News home page

సైబర్ నేరగాళ్లతో జరజాగ్రత్త!

Published Sun, Jan 4 2015 11:04 AM

Cyber crimes in India may double in 2015: Study

న్యూఢిల్లీ: భారత్లో సైబర్ నేరాలు మరింత పెరగనున్నాయి! గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సైబర్ నేరాల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశముంది. 2015లో ఈ కేసుల సంఖ్య మూడు లక్షలకు చేరుకోవచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది.

గతేడాది సైబర్ నేరాలకు సంబంధి 149,254 కేసులు నమోదయ్యాయి. భారత్లో ప్రతి నెలా దాదాపు 13 వేల కేసులు నమోదవుతున్నాయి. నేరస్తులు బ్యాంకింగ్ ఎకౌంట్లు, ఏటీఎమ్/డెబిట్ కార్డులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అలాగే ఆర్థిక రంగం, సెక్యూరిటీ సంస్థలపై దాడులకు పాల్పడుతున్నారు. చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, అల్జీరియా వంటి దేశాలు ప్రధాన కేంద్రాలుగా నేరాలకు పాల్పడుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement