వావ్‌! ఆమె హీరోయిన్‌ అమ్మనా?! | Whaaa.. is that really Shraddha mom? | Sakshi
Sakshi News home page

వావ్‌! ఆమె హీరోయిన్‌ అమ్మనా?!

Mar 24 2016 5:52 PM | Updated on Sep 3 2017 8:29 PM

వావ్‌! ఆమె హీరోయిన్‌ అమ్మనా?!

వావ్‌! ఆమె హీరోయిన్‌ అమ్మనా?!

సరిగ్గా ఇటీవల శ్రద్ధాదాస్ పెట్టిన ఓ ఫొటోను చూసి.. చాలామంది ఇలాగే పప్పులో కాలేశారు.

సంతూర్‌ యాడ్‌ను చూసి ఉంటాం. అందులో ఓ యువతి చలాకీగా ఆడిపాడుతుంటే.. చూసినవారు ఆమె ఏ కాలేజ్‌ అమ్మాయోనని భ్రమపడతారు. తీరా ఓ పాప పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మీ అని.. ఆమెను హగ్‌ చేసుకుంటే.. ఆశ్చర్యపోతారు. సరిగ్గా ఇటీవల శ్రద్ధాదాస్ పెట్టిన ఓ ఫొటోను చూసి.. చాలామంది ఇలాగే పప్పులో కాలేశారు. ఆ ఫొటోలో శ్రద్ధాదాస్‌తో ఉన్నది ఆమె అక్కనో, చెల్లెలో అనుకున్నారు. కానీ ఆమె తన మమ్మీ అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. 'ఆమె మీ అమ్మనా' అంటూ విస్తుపోయారు. 'ఔను, ఔను, ఆమె మా అమ్మనే..ఆ ప్రశ్న ఎప్పుడు నాకు ఎదురవుతూనే ఉంటుంది' అని శ్రద్ధ ఆనందం వ్యక్తం చేసింది.

ఇటీవల శ్రద్ధాదాస్ తన తల్లి పుట్టినరోజును ఘనంగా జరిపింది. ఈ సందర్భంగా ఆమెతో దిగిన ఫొటోలను ఆమె తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. చూడటానికి అక్కాచెల్లెల్లా ఉన్న వీరిద్దరు తల్లికూతుళ్లు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. 'బర్త్‌డే సందర్భంగా మా అమ్మను షాపింగ్‌కు తీసుకెళ్లి చీరలు కొనిపెట్టాను. డిన్నర్‌ ఏర్పాటుచేశాను. ఈ సందర్భంగా ఆమె కేక్ కూడా కట్‌ చేసింది' అని శ్రద్ధ చెప్పింది.
 

Advertisement
 
Advertisement
Advertisement