తండ్రి అయిన బాలీవుడ్ హీరో | Vivek Oberoi becomes father again, wife delivers baby girl | Sakshi
Sakshi News home page

తండ్రి అయిన బాలీవుడ్ హీరో

Apr 22 2015 12:55 PM | Updated on Sep 3 2017 12:41 AM

తండ్రి అయిన బాలీవుడ్ హీరో

తండ్రి అయిన బాలీవుడ్ హీరో

మరో బాలీవుడ్ హీరో తండ్రి ప్రమోషన్ కొట్టేశాడు. హీరో వివేక్ ఒబెరాయ్ భార్య ప్రియాంక ఆల్వా పాపకు జన్మనిచ్చింది.

ముంబయి :  మరో బాలీవుడ్ హీరో తండ్రి ప్రమోషన్ కొట్టేశాడు. హీరో వివేక్ ఒబెరాయ్ భార్య ప్రియాంక ఆల్వా పాపకు జన్మనిచ్చింది.  మంగళవారం ఆమె బుజ్జిపాపకు జన్మనివ్వడంతో వివేక్ ఒబెరాయ్ కుటుంబం సంతోషంలో మునిగితేలుతోంది. ఈ సంతోషకరమైన వార్తను బొమ్మరిల్లు హీరోయిన్ జెనీలియా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వివేక్ ఒబెరాయ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపింది.

'కంగ్రాట్యూలేషన్స్ ప్రియాంకా అండ్ వివేక్ ఒబెరాయ్.. లిటిల్ వీర్ హేజ్ ఏ లిటిల్ సిస్టర్.. సో హ్యాపీ ఫర్ యూ ఆల్.. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్,' అంటూ జెనీలియా ట్విట్ చేసింది.  ఇప్పటికే వివేక్ దంపతులకు రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ బుడ్డోడి పేరు వివాన్ వీర్ ఒబెరాయ్.  వివేక్ ఒబెరాయ్ జేడీ(యూ) దివంగత నేత జీవరాజ్ ఆల్వా కుమార్తె ప్రియాంకను 2010 అక్టోబర్ 29న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రక్త చరిత్ర సినిమా ద్వారా వివేక్ ఒబెరాయ్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

Advertisement
 
Advertisement
Advertisement