బాల డైరెక్షన్లో విక్రమ్ | Vikram next film with creative director bala | Sakshi
Sakshi News home page

బాల డైరెక్షన్లో విక్రమ్

Oct 25 2015 1:15 PM | Updated on Sep 3 2017 11:28 AM

బాల డైరెక్షన్లో విక్రమ్

బాల డైరెక్షన్లో విక్రమ్

కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలకు కూడా కేరాఫ్ అడ్రస్గా మారిన విక్రమ్, త్వరలో మరో ఆసక్తికరమైన సినిమాలో నటిస్తున్నాడు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగిన నటుడు విక్రమ్. ప్రస్తుతం కోలీవుడ్లో కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలకు కూడా కేరాఫ్ అడ్రస్గా మారిన విక్రమ్, త్వరలో మరో ఆసక్తికరమైన సినిమాలో నటిస్తున్నాడు. కెరీర్ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో తనకు నటుడిగా ప్రూవ్ చేసుకునే చిత్రాలను అందించిన క్రియేటివ్ డైరెక్టర్తో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

స్టార్ హీరోగా ఎదిగిన తరువాత కూడా ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలే చేస్తున్న విక్రమ్ ఇటీవల వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. శంకర్ దర్శకత్వలో భారీగా తెరకెక్కిన 'ఐ' నిరాశపరచటంతో పాటు ఇటీవల విడుదలైన ట్రావెల్ డ్రామా 'టెన్ ఎన్నాదుకుల్లా' కూడా ఆశించిన స్ధాయి ఫలితం ఇవ్వలేదు. దీంతో మరోసారి తన కెరీర్ను మలుపు తిప్పిన బాల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు విక్రమ్.

కెరీర్ స్టార్టింగ్లో విక్రమ్కి 'సేతు', 'పితామగన్' లాంటి అవార్డ్ విన్నింగ్ సినిమాలను అందించిన బాల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు విక్రమ్. ప్రస్తుతం అరిమనంభి ఫేం ఆనంద్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విక్రమ్ ఆ సినిమా పూర్తవ్వగానే బాల సినిమాలో నటించనున్నాడు. బాల కూడా ప్రస్తుతం 'తారై తప్పటై' సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తవ్వగానే విక్రమ్తో చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ మొదలవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement