ఒక స్టార్‌ ఫిక్స్‌?

Vikram finalised for Mani Ratnam's adaptation of Ponniyin Selvan - Sakshi

తమిళంలో ఫేమస్‌ నవల ‘పొన్నియిన్‌ సెల్వమ్‌’. ఈ నవలకు ఎప్పటినుంచో దృశ్యరూపం ఇవ్వాలనుకుంటున్నారు దర్శకుడు మణి రత్నం. ఇప్పుడు దానికి ముహూర్తం కుదిరింది. ప్రస్తుతం ఈ నవలను సినిమాగా రూపొందించే ప్లాన్‌లో ఉన్నారు మణి. ఈ ప్రాజెక్ట్‌ కోసం భారీ తారాగణాన్ని ఎంపిక చేసే పనిలో పడ్డారు. విజయ్, విక్రమ్, శింబు, ‘జయం’ రవిలను ముఖ్య తారలుగా నటింపజేయాలనే ప్లాన్‌లో మణి ఉన్నారని కోలీవుడ్‌ టాక్‌. తాజా సమాచారం ఏంటంటే.. ఈ ప్రాజెక్ట్‌కు విక్రమ్‌ ఓకే చెప్పినట్టు సమాచారం. ఆల్రెడీ మణిరత్నం దర్శకత్వంలో ‘రావణ్‌’ చిత్రంలో యాక్ట్‌ చేశారు విక్రమ్‌. వచ్చే ఏడాది స్టార్ట్‌ కానున్న ‘పొన్నియిన్‌ సెల్వమ్‌’  ప్రాజెక్ట్‌కి మిగతా హీరోలు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారా? లేదా చూడాలి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top