ముగ్గరు భామలతో ఇలయదళపతి రొమాన్స్ | vijay romance with three heroins | Sakshi
Sakshi News home page

ముగ్గరు భామలతో ఇలయదళపతి రొమాన్స్

May 13 2017 1:31 AM | Updated on Oct 30 2018 7:36 PM

ముగ్గరు  భామలతో  ఇలయదళపతి రొమాన్స్ - Sakshi

ముగ్గరు భామలతో ఇలయదళపతి రొమాన్స్

ఇలయదళపతి విజయ్‌ మాయాజాలకుడిగా అలరించడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం.

ఇలయదళపతి విజయ్‌ మాయాజాలకుడిగా అలరించడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. భైరవా తరువాత విజయ్‌ నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ఇది ఇలయదళపతికి 61వ చిత్రం అవుతుంది. అలాగే ఆయన త్రిపాత్రాభినయం చేస్తున్న తొలి చిత్రం ఇదే అవుతుందన్న గమనార్హం. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఇందులో విజయ్‌ త్రిపాత్రాభినయం చేస్తుండడం విశేషం. కాజల్‌అగర్వాల్, సమంత, నిత్యామీనన్‌ అంటూ ముగ్గురు ముద్దుగుమ్మలు ఆయనతో రొమాన్స్‌ చేస్తున్నారు. ఇందులో ఒక విజయ్‌ గ్రామీణ ప్రాంత నాయకుడిగా నటిస్తుండగా మరో రెండు పాత్రలు ఆయనకు కొడుకులుగా కనిపించనున్నారని తాజా సమాచారం.

ఇద్దరు కొడుకుల్లో ఒకరు డాక్టరు అని, ఆయనకు జంటగా నటి కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్నారని తెలిసింది. ఇక మరో పాత్రలో విజయ్‌ మ్యాజిక్‌మెన్‌గా నటిస్తున్నారని సమాచారం. ఈ పాత్రే చిత్ర కథను మలుపు తిప్పుతుందట. ఆ మాయాజాలకుడితో చెన్నై చిన్నది సమంత రొమాన్స్‌ చేస్తున్నారట. ఇక మూడో నటి నిత్యామీనన్‌ పాత్ర ఏమిటన్నది ఇంకా తెలియలేదు. చిత్ర యూనిట్‌ ప్రస్తుతం ఐరోపా దేశాల్లో మకాం పెట్టారు. అక్కడ విజయ్, కాజల్‌ అగర్వాల్, సమంతలతో యువళ గీతాలను చిత్రీకరించే పనిలో బిజీగా ఉన్నారు. ఇక ఇందులో ఎస్‌జే.సూర్య, సత్యరాజ్, వడివేలు, సత్యన్, కోవైసరళ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంగీత మాంత్రికుడు ఏఆర్‌.రెహ్మాన్‌ బాణీలు కడుతున్న ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని శ్రీ తేనాండాళ్‌ ఫిలింస్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోందన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement