మళ్లీ ఎప్పుడు? | Varun Tej's Nooks Movie Second Schedule has been planned abroad. | Sakshi
Sakshi News home page

మళ్లీ ఎప్పుడు?

Aug 8 2017 1:15 AM | Updated on Sep 17 2017 5:16 PM

మళ్లీ ఎప్పుడు?

మళ్లీ ఎప్పుడు?

‘ఫిదా’ సక్సెస్‌తో జోష్‌గా ఉన్న వరుణ్‌ తేజ్‌ జోరుగా తన నెక్ట్స్‌ మూవీ షూటింగులో పాల్గొంటున్నారు.

‘ఫిదా’ సక్సెస్‌తో జోష్‌గా ఉన్న వరుణ్‌ తేజ్‌ జోరుగా తన నెక్ట్స్‌ మూవీ షూటింగులో పాల్గొంటున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీయస్‌యన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రంలో ఆయన హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్‌ షెడ్యూల్‌ ముగిసింది.

బహుశా ఈ షెడ్యూల్‌ మంచి అనుభూతిని మిగిల్చి ఉంటుందేమో... నెక్ట్స్‌ షెడ్యూల్‌ ఎప్పుడు వెంకీ? అని అడుగుతున్నారు వరుణ్‌ తేజ్‌. ఫస్ట్‌ షెడ్యూల్‌ కంప్లీట్‌ అయిన సందర్భంగా వరుణ్, వెంకీ, చిత్రకథానాయిక రాశీ ఖన్నా ఓ సెల్ఫీ దిగారు. ఆ ఫొటోను పోస్ట్‌ చేసి, ట్విట్టర్‌ సాక్షిగా ‘నెక్ట్స్‌ షెడ్యూల్‌ ఎప్పుడు వెంకీ’ అనడిగారు వరుణ్‌. సెకండ్‌ షెడ్యూల్‌ను విదేశాల్లో ప్లాన్‌ చేశారట.

Advertisement
 
Advertisement
Advertisement