మిస్టర్ డేట్ చెప్పేశాడు..! | Varun tej, Srinu Vaitla Mister release Date | Sakshi
Sakshi News home page

మిస్టర్ డేట్ చెప్పేశాడు..!

Mar 9 2017 3:59 PM | Updated on Sep 5 2017 5:38 AM

మిస్టర్ డేట్ చెప్పేశాడు..!

మిస్టర్ డేట్ చెప్పేశాడు..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా మిస్టర్. వరుస ఫ్లాప్లతో కష్టాల్లో ఉన్న శ్రీనువైట్ల దర్శకత్వంలో

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా మిస్టర్. వరుస ఫ్లాప్లతో కష్టాల్లో ఉన్న శ్రీనువైట్ల దర్శకత్వంలో లోఫర్ సినిమాతో నిరాశపరిచిన వరుణ్ హీరోగా నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమా ఈ ఇద్దరి కెరీర్లకు కీలకంగా మారింది. ఇటీవల విడుదలైన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. టీజర్ రిలీజ్ తరువాత పెద్దగా వార్తల్లో వినిపించని మిస్టర్ పేరు ఇప్పుడు సడన్గా తెర మీదకు వచ్చింది.

ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ చాలా ఆలస్యం కావటంతో వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. షూటింగ్ మధ్యలో వరుణ్ కాలికి గాయం కావటంతో దాదాపు రెండు నెలల పాటు షూటింగ్ వాయిదా వేశారు. దీంతో సినిమా ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకోవటంతో ఏప్రిల్ 14న సినిమా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఏప్రిల్ నెలాఖరు నుంచి భారీ చిత్రాలు క్యూ కడుతుండటంతో  చిన్న మీడియం రేంజ్ సినిమాల రిలీజ్కు డేట్ దొరకటం కష్టమే.

ఏప్రిల్ మొదటి వారంలో గురు, చెలియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏప్రిల్ 28న బాహుబలి 2 రిలీజ్ అవుతోంది. దీంతో ఈ గ్యాప్ ఏప్రిల్ 14న మిస్టర్ రిలీజ్ చేస్తే బెటర్ అని భావిస్తున్నారట. వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, హేబా పటేల్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement