మిస్టర్‌ ప్రేమకథ | Varun Tej Mister Teaser Released | Sakshi
Sakshi News home page

మిస్టర్‌ ప్రేమకథ

Jan 1 2017 1:00 AM | Updated on Sep 5 2017 12:03 AM

మిస్టర్‌ ప్రేమకథ

మిస్టర్‌ ప్రేమకథ

‘‘మనం ప్రేమను వెతుక్కుంటూ వెళ్తే, ప్రేమే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది’’ అంటున్నారు వరుణ్‌తేజ్‌.

‘‘మనం ప్రేమను వెతుక్కుంటూ వెళ్తే, ప్రేమే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది’’ అంటున్నారు వరుణ్‌తేజ్‌. ఈ ‘మిస్టర్‌’ను ఎవరి ప్రేమ వెతుక్కుంటూ వచ్చిందో చెప్పమంటే ఏప్రిల్‌ వరకూ ఎదురు చూడమంటున్నారు. వరుణ్‌తేజ్‌ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), ‘ఠాగూర్‌’ మధులు నిర్మిస్తున్న సినిమా ‘మిస్టర్‌’. లావణ్యా త్రిపాఠీ, హెబ్బా పటేల్‌ హీరోయిన్లు. కొత్త ఏడాది కానుకగా వరుణ్‌తేజ్‌ ఫస్ట్‌ లుక్, సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘‘వరుణ్‌తేజ్‌ స్థాయి పెంచే చిత్రమిది. 80 శాతం సినిమా పూర్తయింది. రెండు పాటలు, క్లైమాక్స్‌ చిత్రీకరించాల్సి ఉంది.

ఏప్రిల్‌ 14న చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనేది ప్లాన్‌’’ అని నిర్మాతలు తెలిపారు. ‘‘నా కెరీర్‌లో స్పెషల్‌ ఫిల్మ్‌ ఇది. ఎమోషన్స్, విజువల్స్, మ్యూజిక్‌లకు స్కోప్‌ ఉన్న కథ. స్పెయిన్, స్విట్జర్లాండ్, ఇండియా లోని అందమైన ప్రాంతాల్లో షూటింగ్‌ చేశాం’’ అని శ్రీను వైట్ల అన్నారు. ఈ చిత్రానికి కథ: గోపీమోహన్, మాటలు: శ్రీధర్‌ సీపాన, పాటలు: రామజోగయ్య శాస్త్రి, సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమేరా: కేవీ గుహన్, సై్టలింగ్‌: రూపా వైట్ల.
 

Advertisement
 
Advertisement
Advertisement