ఆమెతో కలిసి నటించాలని ఉంది: వరుణ్ తేజ్ | Varun Tej chit chat with fans in Twitter | Sakshi
Sakshi News home page

ఆమెతో కలిసి నటించాలని ఉంది: వరుణ్ తేజ్

Oct 22 2015 4:35 PM | Updated on Sep 3 2017 11:20 AM

ఆమెతో కలిసి నటించాలని ఉంది: వరుణ్ తేజ్

ఆమెతో కలిసి నటించాలని ఉంది: వరుణ్ తేజ్

మెగా వారసుడు, టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ వరుణ్ తేజ్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో లైవ్ చాట్ చేశారు.

మెగా వారసుడు, టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ వరుణ్ తేజ్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో లైవ్ చాట్ చేశారు. తన లేటెస్ట్ మూవీ 'కంచె' విశేషాలతోపాటు అభిమానులు సంధించిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. వాటిలో కొన్ని మీకోసం..

అభిమాని:  డైరెక్టర్ క్రిష్లో మీకు బాగా నచ్చే అంశం?
వరుణ్ తేజ్ : అతని కమిట్మెంట్

అభిమాని : మీ ఆల్ టైం ఫేవరెట్ మూవీ ?
వరుణ్ తేజ్ : రుద్రవీణ

అభిమాని : మెగాస్టార్ సినిమాల్లో దేన్నైనా రీమేక్ చేసే ఛాన్స్ వస్తే మీరు ఏ సినిమాని సెలక్ట్ చేసుకుంటారు?
వరుణ్ తేజ్ : ఛాలెంజ్.. నా ఫేవరెట్ మూవీస్లో ఒకటి

అభిమాని : 'కంచె' సినిమా ద్వారా ఏం నేర్చుకున్నారు ?
వరుణ్ తేజ్ : కులం, మతం, రంగులాంటి వాటితో మనుషులపై వివక్ష చూపకూడదని, మనుషులంతా ఒక్కటేనని

అభిమాని : మీ డ్రీమ్ యాక్ట్రెస్ ఎవరు ? ఏ నటీమణితో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు ?
వరుణ్ తేజ్ : రమ్యకృష్ణ గారు

అభిమాని : ఎవరితో డేటింగ్ చేయాలని కలలు కంటున్నారు ?
వరుణ్ తేజ్ : ఏంజెలినా జోలీ

అభిమాని : పవర్ స్టార్ పాటల్లో ఏదైనా రీమిక్స్ చేయాలనుకుంటే ఏ పాట సెలక్ట్ చేసుకుంటారు ?
వరుణ్ తేజ్ : తమ్ముడు సినిమాలో 'మేడ్ ఇన్ ఆంధ్రా స్టూడెంట్ అంటే..'

అభిమాని : అల్లు అర్జున్ని మీరు ఏమని సంబోధిస్తారు ? అన్నా లేక బావ?
వరుణ్ తేజ్ : బన్ని అన్న

అభిమాని : మీ జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలు ?
వరుణ్ తేజ్ : 'ముకుంద' సినిమా ఫస్ట్ డే షూట్

అభిమాని : మీ చెల్లెలు నిహారిక సినిమాల్లోకి రావడం పట్ల మీ ఫీలింగ్ ?
వరుణ్ తేజ్ : హ్యాపీ

అభిమాని : కొత్త సినిమాకి సైన్ చేసేమందు స్టోరీ ఎవరితో డిస్కస్ చేస్తారు ?
వరుణ్ తేజ్ : నాన్నతో

అభిమాని : మీ అన్నయ్య రామ్ చరణ్ సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ?
వరుణ్ తేజ్ : మగధీర
 

Advertisement
 
Advertisement
Advertisement