విశాల్‌తో రొమాన్స్‌కు సై అంటున్న.. | Varalakshmi Sharath Kumar Romance with Vishal | Sakshi
Sakshi News home page

విశాల్‌తో రొమాన్స్‌కు సై అంటున్న..

Aug 20 2017 3:50 AM | Updated on Sep 17 2017 5:42 PM

విశాల్‌తో రొమాన్స్‌కు సై అంటున్న..

విశాల్‌తో రొమాన్స్‌కు సై అంటున్న..

నటుడు విశాల్‌కు నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌కు మధ్య ప్రేమాయణం గురించి ఆ మధ్య కథలు కథలుగా ప్రచారమైన సంగతి తెలిసిందే.

తమిళసినిమా: నటుడు విశాల్‌కు నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌కు మధ్య ప్రేమాయణం గురించి ఆ మధ్య కథలు కథలుగా ప్రచారమైన సంగతి తెలిసిందే.ఈ జంట మదగజరాజా అనే చిత్రంలో కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అది ప్రేమగా మారి పెళ్లి చేసుకునే స్థాయికి చేరిందనే ప్రచారం హల్‌చల్‌ చేసింది. అలాంటిది ఆ తరువాత విశాల్‌కు వరలక్ష్మికి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయనే ప్రచారం జోరందుకుంది. అలా వదంతుల పర్వం కొనసాగుతున్న సమయంలో ఇటీవల ఒక కార్యక్రమంలో విశాల్‌తో పాటు వరలక్ష్మీశరత్‌కుమార్‌ పాల్గొన్నారు. ఆ సందర్భంలో వరలక్ష్మీ విశాల్‌ను కామరాజర్‌ రేంజ్‌కి పొగిరేశారు.

విశాల్‌ కూడా కామరాజర్‌లా ప్రజల కోసం పనిచేస్తానుగానీ ఆయన మాదిరి పెళ్లి చేసుకోకుండా ఉండను అని పేర్కొనడంతో పాటు త్వరలోనే లక్ష్మీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అన్నారు.దీంతో  విశాల్‌కు వరలక్ష్మీశరత్‌కుమార్‌ మధ్య మళ్లీ ప్రేమ చిగురించిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వాటిని బలపరచే విధంగా ఈ సంచలన జంట మళ్లీ కలిసి నటించడానికి సిద్ధమవుతున్నారు. విశాల్‌ హీరోగా నటిస్తూ నిర్మించనున్న సండైకోళీ–2 చిత్రంలో వరలక్ష్మీశరత్‌కుమార్‌ నటించనున్నారు.

అయితే ఇందులో కథానాయకిగా కీర్తీసురేశ్‌ నటించనున్నారు. మరి వరలక్ష్మీశరత్‌కుమార్‌ పాత్ర ఏమిటనేగా మీ ఆసక్తి. ఇందులో తనకు బావ అయిన విశాల్‌నే పెళ్లి చేసుకుంటానని కంకణం కట్టుకునే యువతిగా చిత్రంలో నటించనున్నారట. అయితే విశాల్‌ మాత్రం నటి కీర్తీసురేశ్‌ను ప్రేమిస్తారట. దీంతో విశాల్‌కు వరలక్ష్మీకి మధ్య వార్‌ నడుస్తోందట. ఇంతకు ముందు విశాల్‌ నటించిన తిమిరు చిత్రంలో నటి శ్రేయారెడ్డి పాత్ర తరహాలో సండైకోళి–2 చిత్రంలో వరలక్ష్మీశరత్‌కుమార్‌ పాత్ర ఉంటుందని çకోలీవుడ్‌ వర్గాల సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement