అప్పుడు మొళి... ఇప్పుడు కాట్రిన్‌ మొళి | Tumhari Sulu Tamil remake starring Jyothika gets a title | Sakshi
Sakshi News home page

అప్పుడు మొళి... ఇప్పుడు కాట్రిన్‌ మొళి

Apr 22 2018 12:22 AM | Updated on Apr 22 2018 12:22 AM

Tumhari Sulu Tamil remake starring Jyothika gets a title - Sakshi

జ్యోతిక

హిందీ హిట్‌ మూవీ ‘తుమ్హారీ సులూ’ తమిళ రీమేక్‌లో జ్యోతిక నటించనున్న విషయం తెలిసిందే. రాధామోహన్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకు ‘కాట్రిన్‌ మొళి’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. పదేళ్ల క్రితం రాధామోహన్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘మొళి’ సినిమాలో ‘కాట్రిన్‌ మొళి’ అనే సాంగ్‌ నుంచి ఈ టైటిల్‌ తీసుకోవడం విశేషం.

గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే సొంతంగా సంపాదించాలనుకునే పాత్రలో జ్యోతిక కనిపించనున్నారు. ఆమె భర్తగా విద్దార్థ్, బాస్‌ పాత్రలో మంచు లక్ష్మీ నటించనున్నారు. ‘మా చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం’ అన్నాయి చిత్రవర్గాలు. జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్‌లో రిలీజ్‌ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement