నేటి ట్రెండ్‌కు తగ్గ సినిమా | Taramani Telugu Movie Audio Launch | Sakshi
Sakshi News home page

నేటి ట్రెండ్‌కు తగ్గ సినిమా

Jun 10 2018 1:04 AM | Updated on Jun 10 2018 1:04 AM

Taramani Telugu Movie Audio Launch - Sakshi

డి. వెంకటేశ్, మారుతి, ఎస్‌కేఎన్, శ్రీనివాస్‌

అంజలి, ఆండ్రియా, వసంత్, రవి ప్రధాన పాత్రల్లో రామ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తారామణి’. తమిళంలో హిట్‌ సాధించిన ఈ సినిమాను అదే పేరుతో జె.ఎస్‌.కె. ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో డీవీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై డి. వెంకటేశ్‌ తెలుగులోకి అందిస్తున్నారు. గుడ్‌ సినిమా గ్రూప్‌ బ్యానర్‌ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మారుతి మాట్లాడుతూ– ‘‘సిన్సియర్‌ ఎఫర్ట్‌ పెట్టి చేసిన సినిమా ఇది. నేటి ట్రెండ్‌కి తగ్గట్లుగా ఉంది. యువన్‌ శంకర్‌ ఆడియో బాగుంది.

మా గుడ్‌ సినిమా గ్రూప్‌లో విడుదల కానుండటం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘సినిమా చూశాను. బాగా నచ్చింది. తెలుగులో అనువదించి, విడుదల చేద్దామని జ్ఞానవేల్‌ రాజాను సంప్రదించాను. అప్పటికే డి. వెంకటేశ్‌ హక్కులు దక్కించుకున్నారని తెలిసింది’’ అన్నారు యస్‌కేయన్‌. ‘‘తెలుగులో కూడా ‘తారామణి’ ఆడియో పెద్ద హిట్‌ సాధిస్తుందన్న నమ్మకం ఉంది. సినిమా కూడా అక్కడిలానే విజయం సాధిస్తుందనుకుంటు న్నాను’’ అన్నారు డి. వెంకటేశ్‌. శ్రీకాంత్, శ్రేయాస్‌ శ్రీనివాస్, రాజేశ్, రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement