నీకై ఎదురు చూస్తుంటాలే! | Taramani Movie Song Launch By Sreelekha | Sakshi
Sakshi News home page

నీకై ఎదురు చూస్తుంటాలే!

Mar 9 2018 5:14 AM | Updated on Mar 9 2018 5:14 AM

Taramani Movie Song Launch By Sreelekha - Sakshi

డి. వెంకటేశ్, శ్రీలేఖ

అంజలి, ఆండ్రియా, వసంత్‌ ముఖ్య తారలుగా రామ్‌ దర్శకత్వంలో రూపొంది, తమిళ్‌లో విజయవంతమైన చిత్రం ‘తారామణి’. జె.ఎస్‌.కె ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సమర్పణలో డీవీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై డి. వెంకటేశ్‌ అదే టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలోని  ‘చేతులు చాచి.. యుగములు వేచి, నీకై ఎదురు చూస్తుంటాలే..’ అనే పాటను సంగీతదర్శకురాలు, గాయని  ఎం.ఎం. శ్రీలేఖ విడుదల చేశారు.

శ్రీలేఖ మాట్లాడుతూ– ‘‘తెలుగులో ఈ సినిమాను విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్‌ రామ్‌ చాలా బాగా తీశారు. వెంకటేశ్‌గారు స్ట్రైట్‌ మూవీస్‌ తీసి, సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘లేడీ ఆడియన్స్‌కు బాగా రీచ్‌ అవుతుందనే శ్రీలేఖగారితో ఈ పాటను రిలీజ్‌ చేయించాం. తమిళ్‌లో మంచి కలెక్షన్స్‌ను రాబట్టిన ఈ సినిమా తెలుగులో అంతకంటే పెద్ద హిట్‌ సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు డి. వెంకటేశ్‌.
 

Advertisement
 
Advertisement
Advertisement