'నేను రెండు రకాలుగా అదృష్టవంతురాల్ని' | Tamannah Bhatia's jewellery brand goes live | Sakshi
Sakshi News home page

'నేను రెండు రకాలుగా అదృష్టవంతురాల్ని'

Apr 20 2015 12:46 PM | Updated on Aug 3 2018 3:04 PM

'నేను రెండు రకాలుగా అదృష్టవంతురాల్ని' - Sakshi

'నేను రెండు రకాలుగా అదృష్టవంతురాల్ని'

మిల్కీ బ్యూటీ తమన్నా ఇపుడు బంగారం వ్యాపారంలోకి అడుగుపెట్టింది.

చెన్నై:  దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు నేటి తరం హీరోయిన్లు. ఓ వైపు హీరోయిన్గా రాణిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇపుడు వ్యాపారంలోకి అడుగుపెట్టింది.  అక్షయ తృతీయ సందర్భంగా డైమండ్ ఆభరణాల వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు సోమవారం  www.witengold.com అనే వెబ్సైట్ను ప్రారంభించింది.

అభిమానుల కోసం,   డైమండ్  చెవి రింగులు, ఉంగరాలు, పెండెంట్స్ లాంటివి తమన్నా స్వయంగా రూపొందించింది.   నటిగా తనను ఎంతగానో అభిమానించిన  ఫ్యాన్స్ కోసం డైమండ్ ఆభరణాలను డిజైన్  చేయడం సంతోషంగా ఉందని ఆమె తెలిపింది.  నటిగా తనను ఆదరించినట్టుగానే  తన వ్యాపారాన్ని  కూడా ఆదరించాలని తమన్నా అభిమానుల్ని కోరింది.

తన తండ్రి ఎప్పటినుంచో  బంగారు ఆభరణాల వ్యాపారంలో ఉన్నారనీ.. చిన్నప్పనుంచీ ఆయన గమనిస్తూ ఈ వృత్తి పట్ల ఆకర్షణ పెంచుకున్నట్లు తమన్నా తెలిపింది.  బంగారు ఆభరణాల వ్యాపారంలోకి  రావడం కలిసి వచ్చిన అదృష్టమని ఆమె పేర్కొంది . ఇష్టాన్ని వృత్తిగా ఎంచుకునే అవకాశాన్ని దక్కించుకుని, అక్కడ రాణించి... మరోరంగంలోకి  టర్న్ అయిన వారు చాలా అదృష్టవంతులని తాను ఎపుడూ అనుకుంటానని తెలిపింది.

అలాగే  తాను రెండు రకాలుగా అదృష్టవంతురాలినని...  మొదటిది నాకిష్టమైన నటన,  ఇపుడు మళ్ళీ ఆభరణాల డిజైనింగ్   రూపంలో   అదృష్టం నన్ను వరించిందంటూ తమన్నా మురిసిపోతోంది.  అయితే సినిమాల్లో అవకాశాలు  క్రమంగా  తగ్గుముఖం పట్టడంతో .. అభిమానుల్లో ఉన్న  క్రేజ్ను సొమ్ము చేసుకునేందుకేనని కొంతమంది చెవులు కొరుక్కుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement