డైరెక్టర్‌గా మరో నటుడు | taking baby steps towards fulfilling a childhood dream:) My next project will be my directorial debut | Sakshi
Sakshi News home page

డైరెక్టర్‌గా మరో నటుడు

Sep 2 2017 7:10 PM | Updated on Sep 17 2017 6:18 PM

డైరెక్టర్‌గా మరో నటుడు

డైరెక్టర్‌గా మరో నటుడు

నటుడు, సింగర్‌ చిన్మయ్‌ భర్త, రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడిగా అరంగేట్రం చోయబోతున్నారు.

ప్రముఖనటుడు, సింగర్‌  చిన్మయి భర్త,  రాహుల్‌ రవీంద్రన్‌  దర్శకుడిగా అరంగేట్రం చోయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్‌ ట్విట్టర​ ద్వారా ప్రకటించారు. శనివారం ట్విట్టర్‌ వేదికగా  ఈ సంతోషాన్ని పంచుకున్నారు. ద‌ర్శ‌కుడిగా తొలి సినిమా తీయ‌బోతున్నాన‌ని రాహుల్ ర‌వీంద్ర‌న్  పేర్కొన్నారు.

తన చిన్ననాటి కల నెరవేరబోతోందని.. ఆ వైపుగా తన తొలి అడుగులు పడుతున్నాయంటూ ట్వీట్‌ చేశారు.  అలాగే ఈ సినిమాకు  హీరో సుశాంత్ అని కూడా క్లారిటీ ఇచ్చారు.  ఈ సరికొత్త ప్రాజెక్ట్‌ను సిరుని సీనా కార్పొరేషన్‌ ప్రొడ్యూస్ చేయబోతోందన్నారు.  అంతేకాదండోయ్‌  హీరోయిన్‌  కోసం వెదుకుతున్నట్టు కూడా రివీల్‌ చేశారు.  అక్టోబర్‌ చివర్లోకానీ, నవంబరులో కాని షూటింగ్‌ మొదలుపెట్టనున్నట్టు వెల్లడించారు. 

అటు సుశాంత్ కూడా త‌న త‌దుప‌రి చిత్రంపై ట్వీట్ చేస్తూ తాను రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించనున్నట్టు తెలిపారు. ఈ సినిమా స్క్రిప్ట్ లవ్లీగా ఉంద‌నీ, త‌న‌కు అభిమానుల  మద్దతును కావాలని పేర్కొన్నారు.

మరోవైపు  రాహుల్‌ ప్రకటనతో ట్విట్టర్‌ లో సందడి నెలకొంది. రాహుల్‌ భార్య, ప్రముఖ గాయని చిన్నయి శ్రీపాద, దర్శకుడు అడవి శేషు, నటుడు వెన్నెల కిషోర్‌ తదితరులు  ఆల్‌ ది బెస్ట్‌  చెప్తూ ట్వీట్‌ చేశారు. దీంతోపాటు నటులు వెన్నెల కిశోర్‌,   విద్యారామన్‌ కూడా ఓ ఆసక్తికరమైన వీడియోను కూడా పోస్ట్‌చేశారు.  దీనిపై  రాహుల్‌ పాజిటివ్‌గా స్పందించారు.  దీంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌లో వీరిద్దరి బెర్త్‌లు కూడా కనఫాం అయినట్టే.

 
 
 

Advertisement
 
Advertisement
Advertisement