‘యమలీల’కు ఏ మాత్రం తగ్గదు : ఎస్వీ కృష్ణారెడ్డి | SV Krishna Reddy's Yamaleela 2 80% shooting completed | Sakshi
Sakshi News home page

‘యమలీల’కు ఏ మాత్రం తగ్గదు : ఎస్వీ కృష్ణారెడ్డి

May 7 2014 10:30 PM | Updated on Aug 29 2018 9:35 PM

‘యమలీల’కు ఏ మాత్రం తగ్గదు : ఎస్వీ కృష్ణారెడ్డి - Sakshi

‘యమలీల’కు ఏ మాత్రం తగ్గదు : ఎస్వీ కృష్ణారెడ్డి

రియల్ ఎస్టేట్ నుంచి రీల్ ఎస్టేట్‌లోకి ఎంటర్ కావడం చాలా ఆనందంగా ఉంది. నా తొలి సినిమానే ఎస్వీ కృష్ణారెడ్డితో చేస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది’’

రియల్ ఎస్టేట్ నుంచి రీల్ ఎస్టేట్‌లోకి ఎంటర్ కావడం చాలా ఆనందంగా ఉంది. నా తొలి సినిమానే ఎస్వీ కృష్ణారెడ్డితో చేస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది’’ అని కేవీ సతీశ్ చెప్పారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో డీయస్ మాక్స్, క్రిష్వి ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘యమలీల -2 ’. మోహన్‌బాబు యమధర్మరాజు పాత్ర పోషిస్తున్నారు. కేవీ సతీశ్ హీరోగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ 80 శాతం పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సతీశ్ మాట్లాడుతూ -‘‘వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ఓ మంచి ఆలోచన ఉంటే సరిపోతుంది. కానీ, హీరోగా నిలబడాలంటే కష్టం.
 
 రోజువారి కూలీలా కష్టపడాలి. కానీ, కృష్ణారెడ్డి నాకా కష్టం తెలియనివ్వకుండా యాక్ట్ చేయించుకుంటున్నారు. ఇప్పటివరకు జరిపిన షూటింగ్ నాకు మంచి అనుభూతినిచ్చింది. ఓ నాలుగు నెలల ట్రిప్‌లా ఈ షూటింగ్ అనిపించింది’’ అని చెప్పారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ -‘‘యమలీల అద్భుతమైన సబ్జెక్ట్. దానికి ఏ మాత్రం తగ్గకుండా ఈ ‘యమలీల 2’ తీస్తున్నాం. సవాళ్లంటే నాకిష్టం. ప్రేక్షకులతో శభాష్ అనిపించుకునే సినిమాలు చేశాను. ఈ సినిమాకి కూడా ఆ మాట అంటారు. సవాల్ చేసి చెబుతున్నా. సతీశ్‌కి ఇది తొలి సినిమా అయినప్పటికీ ఎంతో బాగా యాక్ట్ చేస్తున్నాడు. కచ్చితంగా మంచి హీరోగా నిలబడతాడు’’ అని చెప్పారు. ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన 40 చిత్రాల్లో టాప్ టెన్‌లో ఈ ‘యమలీల 2’ ఉంటుందని అచ్చిరెడ్డి పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement