రోజుకు నాలుగు లక్షలా? 

Is Sunil Taking Four Lakhs Remuneration In Tollywood - Sakshi

కమెడియన్‌గా టాప్‌ ప్లేస్‌లో ఉన్నప్పుడే, హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు సునీల్‌. మొదట్లో రెండు మూడు హిట్లు పడినా.. ఆ తరువాత కథ అడ్డం తిరిగింది. చాల రోజుల నుంచి కనీసం హిట్టు కాదు కదా.. యావరేజ్‌ మూవీ కూడా సునీల్‌ ఖాతాలో పడలేదు. ఇంకా హీరోగా ట్రై చేయడం కంటే.. తనకు లైఫ్‌ ఇచ్చిన కమెడియన్‌ పాత్రల్లోనే నటించేందుకు సిద్ధమయ్యారన్న విషయం తెలిసిందే. 

సునీల్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌, శ్రీనువైట్ల, భీమినేని శ్రీనివాసరావు సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల్లో నటించేందుకు సునీల్‌ రోజుకు నాలుగు లక్షల పారితోషకంగా తీసుకుంటున్నట్లు టాక్‌. దీన్ని బట్టి సునీల్‌ రేంజ్‌ ఏంటో తెలిసిపోతోంది. మళ్లీ సునీల్‌ కమెడియన్‌గా తన సత్తా చాటి, పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటాడేమో చూడాలి. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top