బాద్‌షా కూతురి ఫోటో..నెటిజన్లు ఫిదా | Suhana And Gauri Khan Are Partying In London | Sakshi
Sakshi News home page

బాద్‌షా కూతురి ఫోటో..నెటిజన్లు ఫిదా

Jun 11 2018 1:22 PM | Updated on Oct 22 2018 6:10 PM

Suhana And Gauri Khan Are Partying In London - Sakshi

 బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ గారాల పట్టి సుహానా ఖాన్‌, భార్య గౌరీ ఖాన్‌  సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశారు. కూతురితో కలిసి లండన్‌లో దిగిన ఫోటోలను గౌరీ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. జీన్స్‌, టీ షర్ట్స్‌లో గౌరీ, సిల్వర్‌ కలర్‌ డ్రెస్‌లో సుహానా ఫోటోలకు నెటిజన్లు ఫిదా అయ్యారు. లండన్‌లోని ప్రముఖ కాలేజీలో చదువుతోన్న సుహానా తల్లితో కలిసి లండల్‌లో ఎంజాయ్‌ చేస్తోంది.

కాలేజీ చివరిరోజులు కావడంతో లండన్‌ మొత్తం చుట్టేస్తోంది. కాగా గౌరీ పెట్టిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.సుహానా త్వరలోనే బాలీవుడ్‌కు పరిచయం కానుందని తెలుస్తోంది. ఆమెకు సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. షారుక్‌ తనయ ఫొటోలు ఎప్పుడూ సోషల్‌మీడియాలో కనిపించినా వైరల్‌ అవుతూ ఉంటాయి.

Advertisement
 
Advertisement
Advertisement