జాయ్‌ జాయ్‌ ఎంజాయ్‌ | shruti hassan pure happyness | Sakshi
Sakshi News home page

జాయ్‌ జాయ్‌ ఎంజాయ్‌

May 30 2018 5:07 AM | Updated on Oct 22 2018 6:10 PM

shruti hassan pure happyness - Sakshi

రొటీన్‌కి బ్రేక్‌ కొట్టి సమ్‌థింగ్‌ డిఫరెంట్‌గా ట్రై చేసినప్పుడే లైఫ్‌లో కిక్‌ ఉంటుంది. లేకపోతే బోర్‌ కొడుతుంది. అలా బోర్‌ కొట్టకుండా ఉండేందుకు ఒక్కోసారి చిన్నపిల్ల్లల్లా మారిపోతుంటాం. శ్రుతీహాసన్‌ అలానే చేశారు. పిల్లలు ఆడుకునే చెక్క గుర్రపు బొమ్మపై ఎక్కి ఫుల్‌గా ఎంజాయ్‌ చేశారు. చిన్ననాటి రోజులను గుర్తు తెచ్చుకున్నారు. ఆ ఫన్నీ ఫొటోను ‘ప్యూర్‌ హ్యాపీనెస్‌’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారామె.

లండన్‌ట్రిప్‌లో ఇలా ఫుల్‌గా ఎంజాయ్‌ చేసి, హ్యాపీ మూడ్‌తో ఇండియా ప్రయాణం అయ్యారు శ్రుతీహాసన్‌. లండన్‌ నుంచి గోవా వెళ్లారు. ఇక సినిమాల విషయానికొస్తే తెలుగులో రవితేజ హీరోగా నటించనున్న ఓ చిత్రంలో శ్రుతీహాసన్‌ కథానాయికగా నటించనున్నారన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో మనీష్‌ మంజ్రేకర్‌ దర్శకత్వంలో విద్యుత్‌ జమాల్‌ హీరోగా రూపొందనున్న సినిమాలో శ్రుతీనే హీరోయిన్‌.

Advertisement
 
Advertisement
Advertisement