గౌను తెచ్చిన ఇబ్బంది! | Shraddha Das Pop star role in Rey Movie | Sakshi
Sakshi News home page

గౌను తెచ్చిన ఇబ్బంది!

Mar 24 2015 8:33 AM | Updated on Sep 2 2017 11:16 PM

గౌను తెచ్చిన ఇబ్బంది!

గౌను తెచ్చిన ఇబ్బంది!

‘రేయ్’లో నేను చేసిన పాప్ స్టార్ పాత్ర నా కెరీర్‌కి మంచి బ్రేక్‌నిస్తుంది’’ అని శ్రద్ధాదాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.

 ‘‘ ‘రేయ్’లో నేను చేసిన పాప్ స్టార్ పాత్ర నా కెరీర్‌కి మంచి బ్రేక్‌నిస్తుంది’’ అని శ్రద్ధాదాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. సాయిధరమ్ తేజ్ హీరోగా స్వీయదర్శకత్వంలో వైవీయస్ చౌదరి రూపొందించిన ‘రేయ్’ ఈ నెల 27న విడుదల కానుంది. ఇందులో ప్రతినాయిక పాత్ర చేసిన శ్రద్ధాదాస్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రంలో చేసిన మెక్సికన్ అమెరికా పాప్‌స్టార్ పాత్ర కోసం బరువు తగ్గాను. జెన్నిఫర్ లోపెజ్, బ్రిట్నీ స్పియర్స్ వంటి హాలీవుడ్ తారల వీడియోలను వైవీయస్‌గారు చూపించారు.
 
 వాళ్ల స్టయిల్‌ని చూసి, నాదైన శైలిలో ఈ పాత్ర చేశాను. ఈ సినిమా కోసం 250 నుంచి 300 కాస్ట్యూమ్స్ వాడాను. రెక్కలున్న ఓ గౌను అయితే నన్ను చాలా ఇబ్బందిపెట్టేసింది. అది వేసుకున్న తర్వాత కూర్చోవడానికి కుదిరేది కాదు. ఆ గౌనుకి సంధించిన షూటింగ్ చేసినన్నాళ్లు నిలబడే ఉండేదాన్ని. వైవీయస్‌గారి టేకింగ్ బ్రహ్మాండం. ‘నరసింహా’లో రమ్యకృష్ణ చేసిన తర్వాత ఆ స్థాయి ఉన్న పాత్ర ఇదే అవుతుందనీ, బాగా నటించావనీ రష్ చూసినవాళ్లు చెబుతున్నారు. అందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement