ఆమే మా బాస్ | She is our boss | Sakshi
Sakshi News home page

ఆమే మా బాస్

Mar 29 2016 3:14 AM | Updated on Sep 3 2017 8:44 PM

ఆమే మా బాస్

ఆమే మా బాస్

నజ్రియానే మా కుంటుంబానికి బాస్. ఇలా అంటున్నదేవరో కాదు స్వయానా ఆమె జీవిత భాగస్వామి ఫాహత్ ఫాజిల్‌నే.

నజ్రియానే మా కుంటుంబానికి బాస్. ఇలా అంటున్నదేవరో కాదు స్వయానా ఆమె జీవిత భాగస్వామి ఫాహత్ ఫాజిల్‌నే. కోలీవుడ్‌లో ఐదే ఐదు చిత్రాలతో నాయకిగా ఉన్నత స్థాయికి చేరుకున్న అతి కొద్ది మంది నటీమణుల్లో నజ్రియా ఒకరని కచ్చితంగా చెప్పవచ్చు. నేరం, రాజారాణి, వియై మూడి పేసవుం, తిరుమణం ఎన్నమ్ నిక్కా, నూయ్యాండి చిత్రాలతో తమిళ ప్రేక్షకుల మనసును దోచుకున్న నటి నజ్రియా. సొంత గడ్డపై కొన్ని చిత్రాలు చేసిన ఈ బ్యూటీ నటిగా పరిచయమైన అతి తక్కువ కాలంలోనే మలయాళ నటుడు ఫాహత్ ఫాజిల్‌ను ప్రేమించి పెళ్లాడి నటనకు విరామం ఇచ్చారు. ఇది ఆమె అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసిందనే చెప్పాలి.అయితే అలాంటి వారందరికీ సంతోషాన్నిచ్చే సమాచారం ఏమిటంటే నజ్రియా మళ్లీ తెరపై మెరిసే అవకాశం ఉందన్నది.


ఈ విషయాన్ని ఆమె భర్త ఫాహత్‌నే ఇటీవల ఒక భేటీలో పేర్కొన్నారన్నది గమనార్హం. ఆయనేమన్నారో చూద్దాం. నజ్రియానే మా కుటుంబానికి బాస్. దీన్ని నేను సంతోషంగా అంగీకరిస్తున్నాను. వివాహానంతరం నటించరాదని నజ్రియాకు నేను ఆంక్షలు విధించలేదు. ఈ విషయాన్ని తాను అప్పుడే చెప్పాను. ఇప్పుడూ అదే అంటున్నాను. తనే సంసార జీవితం కోసం నటనకు దూరమైంది. నజ్రియా మళ్లీ ఎప్పుడైనా నటించడానికి రావచ్చు. మంచి స్క్రిప్ట్ కోసం వేచి చూస్తోంది. ఎప్పుడు రీఎంట్రీ అవుతుందన్నది నజ్రియానే వెల్లడిస్తే బాగుంటుంది. తను నటనను కంటిన్యూ చేయడంలో నాకెలాంటి ఆక్షేపణ లేదు అని ఫాహత్ పేర్కొన్నారు. సో నటి నజ్రియా రీఎంట్రీ ఖరారైనట్లే. అయితే ఏ భాషా చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement