షారుక్ అరుదైన వీడియో బయటకు.. | Sharukh khan rare video as Doordarshan anchor | Sakshi
Sakshi News home page

షారుక్ అరుదైన వీడియో బయటకు..

Jul 1 2016 11:08 AM | Updated on Apr 3 2019 6:34 PM

షారుక్ అరుదైన వీడియో బయటకు.. - Sakshi

షారుక్ అరుదైన వీడియో బయటకు..

ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్‌ ఖాన్ ఒక టీవీ ఆర్టిస్టుగా కెరీర్ను ప్రారంభించాడని మనందరికీ తెలిసిందే. ఆయన తొలిసారి ఫౌజీ అనే నాటికలో నటుడిగా అడుగుపెట్టాడు.

ముంబయి: ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్‌ ఖాన్ ఒక టీవీ ఆర్టిస్టుగా కెరీర్ను ప్రారంభించాడని మనందరికీ తెలిసిందే. ఆయన తొలిసారి ఫౌజీ అనే నాటికలో నటుడిగా అడుగుపెట్టాడు. ఆ తర్వాత సర్కస్ అనే పాపులర్ షో ద్వారా బాలీవుడ్ మంచి పేరు సంపాధించుకున్నారు. కానీ, ఆయన దూరదర్శన్ చానెల్లో కూడా ఉద్యోగం చేశాడని ఎంతమందికి తెలుసని అనుకుంటే చాలా తక్కువమందికే అని చెప్పాల్సి ఉంటుంది.

అవును షారుక్‌ ఖాన్ నిజంగానే దూరదర్శన్లో పనిచేశారు. అది కూడా ఒక యాంకర్ గా.. ఆయన 1990నాటి కాలంలో దూరదర్శన్లో ప్రసారం అయ్యే పలు కార్యక్రమాలకు యాంకర్ గా కూడా పనిచేశారు. దానికి సంబంధించిన అత్యంత అరుదైన వీడియో ఒకటి ఇప్పుడు చాలా ఆకట్టుకుంటోంది. ప్రముఖ సింగర్ కుమార్ సానును పరిచయం చేస్తూ ఉన్న ఈ వీడియోను ఓ అభిమాని యూట్యూబ్లో పోస్ట్ చేశాడు. కుమార్ సోనూ కూడా ఆ రోజుల్లో ప్రముఖ సింగర్గా మారి మొత్తం ఫిల్మ్ ఫేర్ అవార్డులు కూడా అందుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement