కూతురి కాళ్లు విరగ్గొడతాడట | Sanjay Dutt on daughter Trishala | Sakshi
Sakshi News home page

కూతురి కాళ్లు విరగ్గొడతాడట

Mar 4 2017 11:59 AM | Updated on Sep 5 2017 5:12 AM

కూతురి కాళ్లు విరగ్గొడతాడట

కూతురి కాళ్లు విరగ్గొడతాడట

జైలు నుంచి విడుదలైన తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సంజయ్ దత్ తిరిగి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు

జైలు నుంచి విడుదలైన తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సంజయ్ దత్ తిరిగి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఆగ్రా పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న భూమి సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు ఖల్ నాయక్. అయితే ప్రస్తుతం సినిమాల కన్నా ఫ్యామిలీ లైఫే ఇంపార్టెంట్ అని భావిస్తున్న సంజయ్, ఎక్కువ సమయం కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడుతున్నాడు. అదే సమయంలో తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు తన పిల్లలకు ఎదురుకావొద్దన్న ఉద్దేశంతో వారి భవిష్యత్తు విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు.

తన తాజా చిత్రం తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో నిజజీవితంలో తన పిల్లల గురించి మీడియాతో మాట్లాడాడు. సినిమాలో తన కూతురి పాత్రకు నిజజీవితంలో తన కూతురి త్రిశాలకు చాలా పోలికలున్నాయన్నా సంజయ్ దత్. 'త్రిశల నటి కావాలని కలలు కంటోంది. కానీ నేను తన కాళ్లు విరగ్గొడదాం అనుకుంటున్నా' అన్నాడు. తన చదువు కోసం ఎంతో సమయం, శక్తి కేటాయించానన్న సంజూ భాయ్ తనని ఫోరెన్సిక్ సైన్స్ చదివించాలని భావిస్తున్నాడట. మరి త్రిశల తన పంతం నెగ్గించుకుంటుందో.. లేక తండ్రి మాట విని బుద్ధిగా చదువుకుంటుందో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement