సంజయ్ దత్కు మళ్లీ పెరోల్.. విడుదల! | Sanjay Dutt gets parole again | Sakshi
Sakshi News home page

సంజయ్ దత్కు మళ్లీ పెరోల్.. విడుదల!

Dec 21 2013 4:28 PM | Updated on Sep 2 2017 1:50 AM

సంజయ్ దత్కు మళ్లీ పెరోల్.. విడుదల!

సంజయ్ దత్కు మళ్లీ పెరోల్.. విడుదల!

బాలీవుడ్ బ్యాడ్బాయ్ సంజయ్దత్ మరోసారి పెరోల్ మీద విడుదలయ్యాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య మాన్యతను చూసుకోడానికి అనుమతించాలని అతడు కోరడంతో నెలరోజుల పాటు పెరోల్ మీద విడుదల చేశారు.

బాలీవుడ్ బ్యాడ్బాయ్ సంజయ్దత్ మరోసారి పెరోల్ మీద విడుదలయ్యాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య మాన్యతను చూసుకోడానికి అనుమతించాలని అతడు కోరడంతో నెలరోజుల పాటు పెరోల్ మీద విడుదల చేశారు. దీంతో ఎర్రవాడ సెంట్రల్ జైలు నుంచి దత్ విడుదలై ముంబై చేరుకున్నాడు. తన భార్యకు గుండెల్లో నెప్పిగా ఉందని, ఉన్నట్టుండి నెల రోజుల నుంచి బరువు కూడా తగ్గిపోతోందని దత్ చెప్పాడు. ఆమె కాలేయంలో పెద్ద కణితి ఉందని, అలాగే ఆమె హృదయస్పందన కూడా సరిగా లేదని కార్డియాలజిస్టు అజయ్ చౌఘలే తెలిపారు. దీంతో మాన్యతను చూసుకోడానికి వీలుగా సంజూబాబాకు మరోసారి పెరోల్ ఇచ్చారు.

ఇంతకుముందు కూడా ఆరోగ్య కారణాలతోనే సంజయ్ దత్కు 15 రోజుల పెరోల్ ఇచ్చి, దాన్ని మరో 15 రోజులు పొడిగించారు. దీంతో అక్టోబర్ నెలంతా సంజయ్దత్ జైలు బయటే ఉన్నారు. ముంబై పేలుళ్ల కేసులో సంజయ్ దత్కు 42 నెలల జైలుశిక్ష పడింది. వాస్తవానికి ఐదేళ్ల శిక్ష పడినా, అప్పటికే 18 నెలల జైలుజీవితం ముగియడంతో మిగిలిన 42 నెలలు మాత్రమే శిక్ష వేశారు.

Advertisement
 
Advertisement
Advertisement