మామకు థ్యాంక్స్‌ చెప్పిన సమంత | Samantha Reacts For Akkineni Nagarjuna Tweet | Sakshi
Sakshi News home page

థాంక్యూ మామా : సమంత

Apr 12 2018 9:04 AM | Updated on Apr 12 2018 12:21 PM

Samantha Reacts For Akkineni Nagarjuna Tweet - Sakshi

చిట్టిబాబుగా రామ్‌చరణ్‌, లచ్చిమిగా సమంత నటించిన రంగస్థలం సినిమా ఘనవిజయంతో అటు అభిమానులు, ఇటు తారాగణం సంబరపడిపోతున్నారు. ఈ సినిమాపై ప్రముఖులందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా అక్కినేని నాగార్జున ‘రంగస్థలం’పై ట్విటర్‌ వేదికగా స్పందించారు. చిత్ర యూనిట్‌తో పాటు కోడలు సమంత నటనను ప్రశంసించారు.  ‘నీ నటనతో పాత్రకు ప్రాణం పోశావ్‌..సినిమా ఆసాంతం చిట్టిబాబులా జీవించావ్‌’ అంటూ రామ్‌ చరణ్‌ ను మెచ్చుకున్నారు. ఇక నా ముద్దుల కోడలు సమంత.. పల్లె పడచులా, పక్కింటి అమ్మాయిలా ఎంత సక్కగున్నదో లచ్చిమి.. అంటూ అభినందించారు. అచ్చమైన పల్లె వాతావరణం తెరపై ఆవిష్కరించడంలో సుకుమార్‌ సక్సెస్‌ అయ్యాడంటూ ప్రశంసించారు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్‌ మేకర్స్‌కి శుభాకాంక్షలు తెలిపారు. నాగార్జున ఈ మేరకు సమంతకు ట్వీట్‌ చేశారు. మావయ్య అభినందనల్ని స్వీకరించిన సమంత.. థాంక్యూ మామా అంటూ రీ ట్వీట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement