టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా సమంత ఫొటో షూట్ | samantha jfw photo shoot | Sakshi
Sakshi News home page

టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా సమంత ఫొటో షూట్

Jul 11 2017 1:15 PM | Updated on Sep 5 2017 3:47 PM

పెళ్లి ఘడియలు దగ్గర పడుతున్నా సమంత గ్లామర్ జోరు మాత్రం తగ్గటం లేదు. పెళ్లి వార్త బయటికి వచ్చిన తరువాత

పెళ్లి ఘడియలు దగ్గర పడుతున్నా సమంత గ్లామర్ జోరు మాత్రం తగ్గటం లేదు. పెళ్లి వార్త బయటికి వచ్చిన తరువాత సమంత సినిమాలకు దూరమవుతుందని భావించారు. అయితే అలాంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ వరుసగా సినిమాలను అంగీకరిస్తూ దూసుకుపోతుంది జెస్పీ. స్టార్ హీరోల సరసన జత కడుతూ హవా కొనసాగిస్తున్న ఈ బ్యూటి అభిమానులకు మరో స్వీట్ షాక్ ఇచ్చింది. రెండు నెలల క్రితం సమంత జేఎఫ్డబ్ల్యూ మేగజైన్ కోసం ఓ ఫొటో షూట్ చేసింది అయితే అప్పట్లో కవర్ పేజ్ కు సంబంధించిన ఒకటి రెండు ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి.

తాజాగా ఈ ఫొటోషూట్ కు సంబంధించిన మరిన్ని ఫోటోలు ఆన్ లైన్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఫొటో షూట్ లో చేనేత వస్త్రాల్లోనే కనిపించినా.. హాట్ హాట్ అందాలతో ఆకట్టుకుంది. కుర్రాళ్ల మతులు పొగొట్టే స్క్రిన్ షోతో సమంత చేసిన షూట్.. ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ గా మారింది. త్వరలో అక్కినేని ఇంటికోడలు అవుతున్న ఈ బ్యూటి ఇంత గ్లామరస్ ఫొటో షూట్ చేయటంతో అభిమానులు షాక్ అవుతున్నారు. సమంత ఫొటో షూట్ తో చేనేత వస్త్రాలకు కూడా సరికొత్త గ్లామర్ వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement