సాయే దైవం | 'Saiye Daivam' releasing soon | Sakshi
Sakshi News home page

సాయే దైవం

Sep 12 2017 2:39 AM | Updated on Sep 19 2017 4:22 PM

సాయే దైవం

సాయే దైవం

షిర్డీ సాయిబాబా భక్తుల అనుభవాలే కథాంశంగా శ్రీనివాస్‌ జీఎల్‌బీ దర్శకత్వంలో పొనుగోటి భవానీ అర్జున్‌రావు నిర్మించిన చిత్రం ‘సాయేదైవం’.

షిర్డీ సాయిబాబా భక్తుల అనుభవాలే కథాంశంగా శ్రీనివాస్‌ జీఎల్‌బీ దర్శకత్వంలో పొనుగోటి భవానీ అర్జున్‌రావు నిర్మించిన చిత్రం ‘సాయేదైవం’. విజయ్‌చందర్‌ సాయిబాబాగా నటించారు. ఇటీవల సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్లీన్‌ ‘యు’ సర్టిఫికేట్‌ లభించింది. నిర్మాత పొనుగోటి భవానీ అర్జున్‌రావు మాట్లాడుతూ– ‘‘సాయి సమాధి చెంది వందేళ్లవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బాబా భక్తులకు కానుకగా త్వరలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాల్లోని సాయిబాబా మందిరాల్లో చిత్రీకరణ జరిపాం. ఇందులో ఐదు పాటలు, మూడు శ్లోకాలు ఉన్నాయి. వాటికి భక్తులతో పాటు శ్రోతల నుంచి చక్కటి ఆదరణ లభిస్తోంది’’ అన్నారు. సుమన్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, రావు రమేశ్, ఎల్బీ శ్రీరామ్‌ నటించిన ఈ చిత్రానికి మాటలు–సంగీతం: పోలూర్‌ ఘటికాచలం.

Advertisement
 
Advertisement
Advertisement