సెప్టెంబర్ 1న 'జవాన్' | Sai dharam tej Jawan gets its release date | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ 1న 'జవాన్'

Jun 28 2017 3:22 PM | Updated on Sep 5 2017 2:42 PM

సెప్టెంబర్ 1న 'జవాన్'

సెప్టెంబర్ 1న 'జవాన్'

తిక్క, విన్నర్ సినిమాలతో నిరాశపరిచిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా జవాన్. రచయిత

తిక్క, విన్నర్ సినిమాలతో నిరాశపరిచిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా జవాన్. రచయిత, దర్శకుడు బివియస్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృష్ణగాడి వీర ప్రేమగాథ ఫేం మెహరీన్ హీరోయిన్గా నటిస్తోంది. కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా సాయి ధరమ్ కెరీర్కు కీలకంగా మారింది.

ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 1న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దసరా సీజన్లో బడా హీరోలు బరిలో దిగుతుండటంతో కాస్త ముందుగానే జవాన్ థియేటర్లలో సందడి చేయనున్నాడు. త్వరలో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించేందుకు రెడీ అవుతోంది జవాన్ యూనిట్.

 

Advertisement
 
Advertisement
Advertisement