సంక్రాంతికి ‘సాక్ష్యం’ ఫస్ట్‌ లుక్

Saakshyam first look will be out for this Sankranthi - Sakshi

జయ జానకీ నాయక సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో సాక్షం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రకృతిలోని పంచభూతాల ఆధారంగా తెరకెక్కుతుండటం, ఇప్పటికే రిలీజైన కాన్సెప్ట్ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమా మీద హైప్ క్రియేట్ అయ్యింది.

ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అభిషేక్ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, శరత్ కుమార్, మీనా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top