మా ఇంట్లో టీవీ కూడా లేదు: హీరోయిన్ | Rebecca Hall doesn’t own a television | Sakshi
Sakshi News home page

మా ఇంట్లో టీవీ కూడా లేదు: హీరోయిన్

Sep 27 2016 8:11 PM | Updated on Sep 4 2017 3:14 PM

మా ఇంట్లో టీవీ కూడా లేదు: హీరోయిన్

మా ఇంట్లో టీవీ కూడా లేదు: హీరోయిన్

తన ఇంట్లో టీవీ కూడా లేదని ‘ఐరన్ మాన్ 3’ సినిమా హీరోయిన్ రెబెకా హాల్ వెల్లడించింది.

లండన్: తన ఇంట్లో టీవీ కూడా లేదని ‘ఐరన్ మాన్ 3’  సినిమా హీరోయిన్ రెబెకా హాల్ వెల్లడించింది. పాత ఫ్యాషన్లకే తాను ప్రాధాన్యం ఇస్తానని తెలిపింది. న్యూస్ పేపర్ల ద్వారానే సమాచారం తెలుసుకుంటానని 34 ఏళ్ల రెబెకా చెప్పింది. ‘టీవీలో న్యూస్ చూడడానికి ఇష్టపడను. అందుకే మా ఇంట్లో టీవీ లేదు. పాత తరం వారిలా దినపత్రికలు చదవడానికే ఇష్టపడతాన’ని ఆమె తెలిపింది. ప్రాధాన్యమున్న పాత్ర ఇచ్చినందుకే ‘ఐరన్ మాన్ 3’  సినిమాలో నటించానని చెప్పింది.

తాజాగా ‘క్రిస్టీన్’  సినిమాలో టైటిల్ రోల్ పోషించింది. 1974లో టీవీ ప్రత్యక్ష ప్రసారంలో తుపాకీతో కాల్చుకుని మృతి చెందిన ఫ్లోరిడా న్యూస్ కాస్టర్ క్రిస్టీన్ చబ్ బక్ ప్రాత్రలో ఆమె నటించింది. ‘ఇందులో నటించడానికి ముందు ఎప్పుడు చబ్ బక్ పేరు వినలేదు. ఈ సినిమా స్క్రిప్ట్ నన్ను ఎంతోగానే కదిలించింది. వెంటనే నా అంగీకారం తెలిపాన’ని రెబెకా హాల్ వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement