రవితేజ హీరోగా 'రాజా ది గ్రేట్' | Raviteja Next film Raja The Great | Sakshi
Sakshi News home page

రవితేజ హీరోగా 'రాజా ది గ్రేట్'

Jan 26 2017 10:14 AM | Updated on Sep 5 2017 2:11 AM

రవితేజ హీరోగా 'రాజా ది గ్రేట్'

రవితేజ హీరోగా 'రాజా ది గ్రేట్'

లాంగ్ గ్యాప్ తరువాత మాస్ మహరాజ్ రవితేజ షూటింగ్కు రెడీ అవుతున్నాడు. దాదాపు సంవత్సర కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ సీనియర్ హీరో,

లాంగ్ గ్యాప్ తరువాత మాస్ మహరాజ్ రవితేజ షూటింగ్కు రెడీ అవుతున్నాడు. దాదాపు సంవత్సర కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ సీనియర్ హీరో, ఒకేసారి రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. అంతేకాదు ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను కూడా రిలీజ్ చేసిన అభిమానులను ఖుషీ చేస్తున్నాడు.

జనవరి 26న తన పుట్టిన రోజు కానుకగా 'టచ్ చేసి చూడు' ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే రిలీజ్ కాగా.. తాజాగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న 'రాజా ది గ్రేట్' టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రవితేజ అంధుడి పాత్రలో కనిపించనున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement
 
Advertisement
Advertisement