రాజా... నువ్వు గ్రేట్‌! | Ravi Teja's next is Raja The King? | Sakshi
Sakshi News home page

రాజా... నువ్వు గ్రేట్‌!

Jan 21 2017 10:33 PM | Updated on Sep 5 2017 1:46 AM

రాజా... నువ్వు గ్రేట్‌!

రాజా... నువ్వు గ్రేట్‌!

రవితేజ హీరోగా నటించబోయే కొత్త సినిమా స్క్రిప్ట్‌ రెడీ... టైటిల్‌ కూడా రెడీ!

రవితేజ హీరోగా నటించబోయే కొత్త సినిమా స్క్రిప్ట్‌ రెడీ... టైటిల్‌ కూడా రెడీ! మంచి ముహూర్తం చూసి దర్శక–నిర్మాతలు షూటింగ్‌ ప్రారంభించడమే తరువాయి. రామ్‌ దగ్గర్నుంచి ఎన్టీఆర్‌... అక్కణ్ణుంచి అటూ ఇటూ తిరిగిన బ్లైండ్‌మ్యాన్‌ స్టోరీ, చివరకు రవితేజ దగ్గరికి చేరిందట! ఈ కథకు రవితేజ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారని సమాచారం. ‘పటాస్‌’, ‘సుప్రీమ్‌’ చిత్రాల ఫేమ్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో రవితేజ అంధుడిగా కనిపించనున్నారని ఫిల్మ్‌నగర్‌ వర్గాల సమాచారం.

ప్రముఖ నిర్మాత ‘దిల్‌’ రాజు నిర్మించనున్న ఈ సినిమాకి ‘రాజా... ది గ్రేట్‌’ టైటిల్‌ ఖరారు చేశారట! ‘‘ఆల్మోస్ట్‌ స్క్రిప్ట్‌ వర్క్‌ ఫైనల్‌ వెర్షన్‌ పూర్తయింది. మార్చిలో షూటింగ్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రవితేజ పాత్ర, సినిమా చాలా కొత్తగా ఉంటుంది’’ అని యూనిట్‌ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇందులో రవితేజకి జోడీగా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఫేమ్‌ మెహరీన్‌ కౌర్‌ నటించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement