స్పీడు పెంచిన రవితేజ..! | ravi teja in telugu remake of tamil movie bogan | Sakshi
Sakshi News home page

స్పీడు పెంచిన రవితేజ..!

Mar 25 2017 3:55 PM | Updated on Sep 5 2017 7:04 AM

స్పీడు పెంచిన రవితేజ..!

స్పీడు పెంచిన రవితేజ..!

బెంగాల్ టైగర్ సినిమా తరువాత ఏడాదికి పైగా వెండితెరకు దూరంగా ఉన్న రవితేజ ఇటీవల తిరిగి షూటింగ్లకు

బెంగాల్ టైగర్ సినిమా తరువాత ఏడాదికి పైగా వెండితెరకు దూరంగా ఉన్న రవితేజ ఇటీవల తిరిగి షూటింగ్లకు హాజరవుతున్నాడు. గ్యాప్లో ఫుల్ రీచార్జ్ అయిన మాస్ మహరాజ్ ఒకేసారి రెండు సినిమాలను పట్టాలెక్కించాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో రాజా ది గ్రేట్తో పాటు విక్రమ్ సిరి దర్శకత్వంలో టచ్ చేసి చూడు సినిమాల షూటింగ్లలో ఒకేసారి పాల్గొంటున్నాడు.

ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే తాజాగా మరో సినిమాను అంగీకరించాడన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల తమిళ్లో ఘనవిజయం సాధించిన బోగన్ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. జయం రవి, అరవింద్ స్వామి హీరోలుగా తెరకెక్కిన బోగన్ సినిమాను తమిళ్లో డైరెక్ట్ చేసిన లక్ష్మణ్ తెలుగులోనూ డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. జయం రవి పాత్రలో రవితేజ నటిస్తుండగా అరవింద్ స్వామి పాత్రకు తెలుగు టాప్ హీరోను సంప్రదిస్తున్నారట. త్వరలోనే ఈ రీమేక్పై చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వనుంది.

Advertisement
 
Advertisement
Advertisement