లంకలో ఏం జరిగింది? | rashi lanka movie teaser release | Sakshi
Sakshi News home page

లంకలో ఏం జరిగింది?

Mar 15 2017 12:38 AM | Updated on Sep 5 2017 6:04 AM

లంకలో ఏం జరిగింది?

లంకలో ఏం జరిగింది?

సీతను అపహరించిన రావణుడు లంకకు తీసుకువెళ్లి అశోకవనంలో బందీగా ఉంచుతాడు. అప్పుడు రాముడు తన సతీమణి కోసం యుద్ధం చేస్తాడు.

సీతను అపహరించిన రావణుడు లంకకు తీసుకువెళ్లి అశోకవనంలో బందీగా ఉంచుతాడు. అప్పుడు రాముడు తన సతీమణి కోసం యుద్ధం చేస్తాడు. రామాయణం విన్నోళ్లకూ, చదివినోళ్లకూ ఈ కథ, ‘లంక’ అనే ఊరి పేరు బాగా తెలుసు. ఇప్పుడీ కథ ఎందుకంటే... ‘లంక’ పేరుతో ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ రూపొందుతోంది. రాశి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ ‘లంక’లో సీతారాములు ఎవరు? రావణుడు ఎవరు? అని దర్శకుడు శ్రీమునిని అడిగితే... ‘‘ఈ రోజే టీజర్‌ విడుదల చేశాం కదా.

కొన్ని రోజులు వెయిట్‌ చేస్తే, ఆ విషయాన్నీ చెప్పేస్తాం’’ అన్నారు. నామన దినేశ్, నామన విష్ణుకుమార్‌ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను మంగళవారం దర్శకుడు మారుతి విడుదల చేశారు. ‘‘నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరున పాటల్ని, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, సమర్పకులు: నామన శంకర్రావు–సుందరి.
 

Advertisement
 
Advertisement
Advertisement