రానా మరో ప్రయోగం..! | Rana and Naveen Kasturia in Viu web series | Sakshi
Sakshi News home page

రానా మరో ప్రయోగం..!

Aug 19 2017 12:55 PM | Updated on Sep 17 2017 5:42 PM

రానా మరో ప్రయోగం..!

రానా మరో ప్రయోగం..!

కెరీర్ స్టార్టింగ్ నుంచే ప్రయోగాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న యంగ్ హీరో రానా ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు.

కెరీర్ స్టార్టింగ్ నుంచే ప్రయోగాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న యంగ్ హీరో రానా ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. హీరోగానే కాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా నటించిన భల్లాలదేవ ఇప్పుడు వెబ్ మీడియాలోకి అడుగుపెడుతున్నాడు. తాను వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న నెంబర్ వన్ యారి విత్ రానా కార్యక్రమ నిర్మాతల కోసం ఈ ప్రయోగం చేస్తున్నాడు.

నెంబర్ వన్ యారి విత్ రానా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వియూ సంస్థ ఇప్పటికే పలు వెబ్ సీరీస్ లతో ఆకట్టుకుంటోంది. తాజా రానా, నవీన్ కస్తూరియాలతో ఓ 'సోషల్' పేరుతో మరో వెబ్ సీరీస్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. సోషల్ మీడియాకు అలవాటు పడిన యువత ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటోంది అన్న నేపథ్యంలో ఈ వెబ్ సీరీస్ ను తెరకెక్కిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement