‘పట్టపగలు’ పూర్తి కాలేదు | ram gopal varma and raja sekhar movie is 'patta pagalu' | Sakshi
Sakshi News home page

‘పట్టపగలు’ పూర్తి కాలేదు

Jan 3 2014 11:40 PM | Updated on Sep 2 2017 2:15 AM

‘పట్టపగలు’ పూర్తి కాలేదు

‘పట్టపగలు’ పూర్తి కాలేదు

నిత్యం వివాదాలతో సావాసం చేసే రామ్‌గోపాల్‌వర్మ, క్రమశిక్షణకు మారుపేరైన మోహన్‌బాబు కలిసి సినిమా చేస్తున్నారనే వార్త సినీ వర్గాలనే కాక, సగటు ప్రేక్షకుణ్ణి కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.

నిత్యం వివాదాలతో సావాసం చేసే రామ్‌గోపాల్‌వర్మ, క్రమశిక్షణకు మారుపేరైన మోహన్‌బాబు కలిసి సినిమా చేస్తున్నారనే వార్త సినీ వర్గాలనే కాక, సగటు ప్రేక్షకుణ్ణి కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అందులోంచి తేరుకునేలోపే... మరోసారి అందరికీ షాకిచ్చారు రామ్‌గోపాల్‌వర్మ. అతి రహస్యంగా... డా.రాజశేఖర్‌తో ఆయన సినిమా కూడా తీసేస్తున్నారు. షూటింగ్ మొత్తం పూర్తయిందని బయట ప్రచారం జరుగుతోంది. అయితే అది కరెక్ట్ కాదని తెలిసింది. కొంత షూటింగే జరిగిందట. ఇంతకూ ఆ సినిమా పేరు ఏంటంటే... ‘పట్టపగలు’.
 
  హారర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పెళ్లికావాల్సిన కూతురున్న తండ్రిగా రాజశేఖర్ నటిస్తున్నారట. ఈ పాత్ర కోసం మేకప్ లేకుండా, రియల్ గెటప్‌లోనే ఆయన నటిస్తున్నారట. బాలీవుడ్ సినిమా ‘బ్రేకప్’లో రణధీర్‌కి జోడీగా నటించిన స్వాతి దీక్షిత్ ఇందులో రాజశేఖర్ కూతురి పాత్రను పోషిస్తున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement