కుర్రాడికి కోటి కావాలంట..? | Raj Tarun Demand for huge Remuneration | Sakshi
Sakshi News home page

కుర్రాడికి కోటి కావాలంట..?

Jun 11 2016 11:35 AM | Updated on Sep 4 2017 2:15 AM

కుర్రాడికి కోటి కావాలంట..?

కుర్రాడికి కోటి కావాలంట..?

ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కుర్రహీరో రాజ్ తరుణ్. షార్ట్ ఫిలింస్ నుంచి వెండితెర మీదకు వచ్చిన ఈ కుర్రాడు. తరువాత సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ లాంటి సినిమాల సక్సెస్తో...

ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కుర్రహీరో రాజ్ తరుణ్. షార్ట్ ఫిలింస్ నుంచి వెండితెర మీదకు వచ్చిన ఈ కుర్రాడు. తరువాత సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ లాంటి సినిమాల సక్సెస్తో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు నిరాశపరిచినా మంచు విష్ణుతో కలిసి చేసిన మల్టీ స్టారర్ ఈడోరకం ఆడో రకం విజయం సాధించటంతో రాజ్ తరుణ్ డేట్స్ కోసం నిర్మాతలు ప్రయత్నాలు ప్రారంభించారు.

డిమాండ్ ఉన్నప్పుడే కాస్త వెనకేసుకోవాలని ఫీలయ్యాడేమో.. ఈ కుర్ర హీరో తన నెక్ట్స్ సినిమాకు ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. ఇలా భారీ మొత్తం డిమాండ్ చేయటం వల్లే.., కొన్ని బడా నిర్మాణ సంస్థల నుంచి వచ్చిన ఆఫర్లు కూడా వెనక్కి వెల్లిపోయాయన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తున్న ఈ వార్తలపై రాజ్ తరుణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement