'తలైవా'లా ఎవరూ ఉండరు! | Radhika Apte Experience of Filming Kabali With Rajinikanth | Sakshi
Sakshi News home page

'తలైవా'లా ఎవరూ ఉండరు!

Apr 28 2016 7:02 PM | Updated on Sep 3 2017 10:58 PM

'తలైవా'లా ఎవరూ ఉండరు!

'తలైవా'లా ఎవరూ ఉండరు!

'ప్రపంచంలో ఆయనలా ఎవరూ ఉండరు. ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి.. ఎంతో స్ఫూర్తినిచ్చారు'

'ప్రపంచంలో ఆయనలా ఎవరూ ఉండరు. ఆయన  చాలా అద్భుతమైన వ్యక్తి.. ఎంతో స్ఫూర్తినిచ్చారు' అంటూ దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతోంది రాధికా ఆప్టే. రజనీ తాజా సినిమా 'కబాలి'లో హీరోయిన్‌గా నటిస్తోంది. నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు భావిస్తున్న ఈ సినిమాలో రజనీ డాన్‌లాగా కనిపిస్తుండగా, ఆయన భార్యగా రాధిక కనిపించనుంది.

మరీ అంత గొప్ప లివింగ్ లెజండ్‌తో కలిసి నటించడం ఎలా ఉంది అని అడిగితే.. 'రజనీకాంత్‌తో కలిసి పనిచేయడం ఎవరూ ఎంజాయ్‌ చేయరు. నేను చాలా ఎంజాయ్‌ చేశాను. నా జీవితంలోనే ఇది బెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఎందుకంటే రజనీ సర్‌లా ఎవరూ ఉండరు. ఆయన అద్భుతమైన వ్యక్తి. ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో స్ఫూర్తినిచ్చింది' అని రాధిక తెలిపింది. పా రంజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ చాలావరకు మలేషియాలోనే జరిగింది. రాధిక తాజా హిందీ చిత్రం 'ఫొబియా' ట్రైలర్‌ లాంచ్ సందర్భంగా ఆమె విలేకరులతో పిచ్చాపాటిగా ముచ్చటించింది. పవన్ క్రిపాల్నీ దర్వకత్వంలో వస్తున్న ఈ సినిమా సైకాలజికల్ థ్రిల్లర్ అని ఆమె తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement