ఆదివాసీయుల జీవనపోరాటం! | R Narayana Murthy Dandakaranya Movie Press Meet | Sakshi
Sakshi News home page

ఆదివాసీయుల జీవనపోరాటం!

Nov 29 2015 11:54 PM | Updated on Sep 3 2017 1:13 PM

ఆదివాసీయుల జీవనపోరాటం!

ఆదివాసీయుల జీవనపోరాటం!

ఆదివాసీయుల సంక్షేమం కోసం రాజ్యాంగంలో ఎన్నో చట్టాలున్నా వాటి అమలు మాత్రం జరగడం లేదు.

 ‘‘ఆదివాసీయుల సంక్షేమం కోసం రాజ్యాంగంలో ఎన్నో చట్టాలున్నా వాటి అమలు మాత్రం జరగడం లేదు. మనుగడను కాపాడుకోవడం కోసం వాళ్లు చేస్తున్న పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రం చేశా’’ అని ఆర్.నారాయణమూర్తి చెప్పారు.  స్వీయదర్శకత్వంలో ఆయన ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన చిత్రం ‘దండకారణ్యం’. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది.
 
 నారాయణమూర్తి మాట్లాడుతూ- ‘‘అడవుల్లో ప్రభుత్వం చేపట్టే తవ్వకాల కారణంగా పర్యావరణం నాశనమవుతోంది.  ప్రభుత్వ విధానాల కారణంగా ఆదివాసీయుల ఉనికి ప్రశ్నార్థకమవుతోంది. వారి జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే చిత్రం ఇది. విజయనగరం, శ్రీకాకుళంలతో పాటు ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో చిత్రీకరణ జరిపాం. ప్రజా గాయకుడు గద్దర్ ఇందులో మూడు పాటలు పాడారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement