ప్రియదర్శి ఇంట ‘పెళ్లి సందడి’ | Priyadarshi marriage date fixed | Sakshi
Sakshi News home page

Feb 20 2018 12:41 PM | Updated on Feb 20 2018 12:43 PM

Priyadarshi marriage date fixed - Sakshi

ప్రియదర్శి, రిచా

పెళ్లిచూపులు సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ నటుడు ప్రియదర్శి ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ కమెడియన్‌గా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా యంగ్ హీరోలకు ఫ్రెండ్‌గా దాదాపు అన్నిసినిమాల్లో కనిపిస్తున్నాడు ఈ హాస్యనటుడు. తెలంగాణ యాసలో తనదైన కామెడీ టైమింగ్‌తో దూసుకుపోతున్నాడు. కెరీర్‌ పరంగానే కాదు వ్యక్తిగత జీవితంలోనూ ప్రియదర్శి కొత్త బంధాల్లోకి అడుగుపెట్టబోతున్నాడు.

ప్రేమికుల రోజు సందర్భంగా తనకు కాబోయే జీవిత భాగస్వామి రిచాను అభిమానులకు పరిచయం చేశాడు ప్రియదర్శి. తాజాగా వీరి వివాహానికి సంబంధించిన మరిన్ని వార్తలు ఫిలిం నగర్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ నెల 23న హైదరాబాద్‌లో ప్రియదర్శి వివాహం జరగనుంది. ఈ కార్యక్రమంలో కేవలం ఇరు కుటుంబాల పెద్దలు మాత్రమే పాల్గొననున్నారు. తరువాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం 26న గ్రాండ్‌ గా రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement