భయపెడుతున్న ఎన్టీఆర్ లుక్ | Ntr Negative role Look in Jai Lava Kusa | Sakshi
Sakshi News home page

భయపెడుతున్న ఎన్టీఆర్ లుక్

Mar 26 2017 9:19 AM | Updated on Sep 5 2017 7:09 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవకుశ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవకుశ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. అందులో ఒకటి నెగెటివ్ రోల్ అన్న ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఎన్టీఆర్ నెగెటివ్ రోల్ కు సంబంధించిన లుక్ ఇదేనంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు హల్ చల్ చేస్తున్నాడు. అయితే అవి ఎన్టీఆర్ ఫోటోలు కాదు. అచ్చు ఎన్టీఆర్ లా కనిపిస్తున్న మాస్క్లు.

జై లవకుశ షూటింగ్ ప్రారంభానికి ముందు లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ట్రయాలజీకి వర్క్ చేసిన ప్రఖ్యాత హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ వాన్స్ గార్ట్ వెల్, ఎన్టీఆర్ కోసం హైదరాబాద్ వచ్చాడు. ఎన్టీఆర్ లుక్ విషయంలో ఎన్నో డిజైన్స్ తరువాత ఫైనల్ గా ఈ లుక్ ను ఫిక్స్ చేశారట. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. తాజాగా రిలీజ్ అయిన ఫోటోలతో ఆ ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరుగుతున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement