రోరింగ్‌ 'కబాలి'! ఈ కొత్త లుక్‌ చూశారా? | New Kabali poster teases fans before teaser launch | Sakshi
Sakshi News home page

రోరింగ్‌ 'కబాలి'! ఈ కొత్త లుక్‌ చూశారా?

Apr 30 2016 7:48 PM | Updated on Sep 3 2017 11:07 PM

రోరింగ్‌ 'కబాలి'! ఈ కొత్త లుక్‌ చూశారా?

రోరింగ్‌ 'కబాలి'! ఈ కొత్త లుక్‌ చూశారా?

'కబాలి' సిద్ధమవుతున్నాడు..

'కబాలి' సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఆదివారం ఉదయం 11 గంటలకు సినిమా టీజర్‌ విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయగా.. అంతకుముందు రజనీ కాంత్‌ అభిమానులకు చిన్నకానుక తరహాలో 'కబాలి' కొత్త లూక్‌ను విడుదల చేశారు. వయస్సు పెరుగుతున్నా తన నటనలో స్టామినా తగ్గలేదని, తన స్టైల్‌లో ఏమాత్రం మార్పులేదని చాటుతూ ఈ కొత్త పోస్టర్‌లో రజనీ అభిమానులను మెస్మరైజ్‌ చేస్తున్నాడు. చేతిలో తుపాకీ పట్టుకొని పవర్‌ఫుల్ ఎమోషన్స్‌తో రజనీ ఈ పోస్టర్‌లో అదరగొట్టేలా కనిపిస్తున్నాడు.

ఇక ఎన్నో అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను ఆదివారం ఉదయం 11 గంటలకు రిలీజ్‌ చేస్తున్నారు. నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు భావిస్తున్న ఈ సినిమాలో రజనీ వృద్ధ డాన్‌గా రెండు పార్శ్వాలున్న వైవిధ్యమైన పాత్రను పోషిస్తుండగా.. ఆయన భార్యగా రాధిక ఆప్టే కనిపించనుంది. పా రంజిత్ దర్శకత్వంలో వస్తున్న 'కబాలి' సినిమా కథ అండర్‌ వరల్డ్ మాఫియా చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement