'నాతో సినిమా చేస్తే రజనీకాంత్ ఛాన్స్ ఇస్తాడు' | nawazuddin siddiqui about rajinikanth | Sakshi
Sakshi News home page

'నాతో సినిమా చేస్తే రజనీకాంత్ ఛాన్స్ ఇస్తాడు'

Sep 11 2016 1:44 PM | Updated on Sep 4 2017 1:06 PM

'నాతో సినిమా చేస్తే రజనీకాంత్ ఛాన్స్ ఇస్తాడు'

'నాతో సినిమా చేస్తే రజనీకాంత్ ఛాన్స్ ఇస్తాడు'

విలక్షణ పాత్రలతో బాలీవుడ్ సినీ అభిమానులను ఆకట్టుకుంటున్న నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే కాకుండా హీరోగా కూడా అలరిస్తున్న ఈ గ్రేట్ యాక్టర్, దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్పై...

విలక్షణ పాత్రలతో బాలీవుడ్ సినీ అభిమానులను ఆకట్టుకుంటున్న నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే కాకుండా హీరోగా కూడా అలరిస్తున్న ఈ గ్రేట్ యాక్టర్, దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్పై ఆస్తకికర వ్యాఖ్యలు చేశాడు. నవాజుద్దీన్ సిద్ధిఖీ లీడ్ రోల్లో నటించిన ఫ్రీకీ అలీ ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగం నవాజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

తనతో పాటు హీరోయిన్గా నటించిన భామలకు నెక్ట్స్ సినిమానే రజనీకాంత్ ఛాన్స్ ఇస్తున్నాడన్నాడు నవాజ్. అందుకు ఉదాహరణలు కూడా చెప్పాడు. తన సరసన మాంజీ సినిమాలో హీరోయిన్గా నటించిన రాధికా ఆప్టే వెంటనే రజనీ కాంత్ కబాలీలో నటించింది. ప్రస్తుతం తన ఫ్రీకీ అలీలో హీరోయిన్గా నటించిన అమీజాక్సన్ రజనీ నెక్ట్స్ సినిమా రోబో సీక్వల్లో హీరోయిన్గా నటిస్తోంది అంటూ అదంరికీ షాక్ ఇచ్చాడు. తన సినిమా ప్రమోషన్ కోసం సరదాగా నవాజుద్దీన్ చేసిన ఈ కామెంట్స్కు హాట్ బ్యూటి అమీ జాక్సన్ కూడా వంత పాడింది.

Advertisement
 
Advertisement
Advertisement