'తుంటరి'గా రౌడీఫెలో | nara rohith next movie title thuntari | Sakshi
Sakshi News home page

'తుంటరి'గా రౌడీఫెలో

Oct 22 2015 11:16 AM | Updated on Sep 3 2017 11:20 AM

'తుంటరి'గా రౌడీఫెలో

'తుంటరి'గా రౌడీఫెలో

ప్రతినిథి, రౌడీఫెలో, అసుర లాంటి వరుస హిట్స్ తో మంచి ఫాంలో ఉన్న నారారోహిత్ మరో ఇంట్రస్టింగ్ టైటిల్తో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. ప్రస్తుతం రోహిత్ గుండెల్లో గోదారి ఫేం కుమార్ నాగేంద్ర...

ప్రతినిథి, రౌడీఫెలో, అసుర లాంటి వరుస హిట్స్ తో మంచి ఫాంలో ఉన్న నారా రోహిత్ మరో ఇంట్రస్టింగ్ టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం రోహిత్ గుండెల్లో గోదారి ఫేం కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తమిళ రీమేక్గా తెరకెక్కుతున్న ఈసినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కథ అందిస్తున్నాడు. షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు తుంటరి అనే టైటిల్ను ఫైనల్ చేశారు చిత్రయూనిట్.

శ్రీ కీర్తి ఫిలిమ్స్ బ్యానర్పై రెండో ప్రయత్నంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో న్యూ లుక్లో దర్శనమివ్వనున్నాడు నారా రోహిత్. త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను దసరా సందర్బంగా రిలీజ్ చేశారు. డెస్టినీ వర్సెస్ హార్డ్ వర్క్ అనే స్టేట్మెంట్తో నారారోహిత్ ట్రెండీ లుక్తో డిజైన్ చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement